Share News

వానలపై మంత్రులు నిమ్మల, నారాయణ సమీక్షలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:54 AM

భారీ వర్షాల నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ‘వార్‌రూమ్‌’లో వర్షాలు, వరదలను గమనిస్తూ ఉండాలన్నారు.

వానలపై మంత్రులు నిమ్మల, నారాయణ సమీక్షలు

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ‘వార్‌రూమ్‌’లో వర్షాలు, వరదలను గమనిస్తూ ఉండాలన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమాండ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ ప్రశాంతి, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎస్‌సీ నరసింహమూర్తితో కలసి ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో వరద ఉధృతిపై ఆయన సమీక్షించారు. కాగా, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పట్టణాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాల పరిస్థితి, నీటి నిల్వలు, డ్రెయినేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణ, అత్యవసర సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:54 AM