ఉపాధ్యాయులపై దుష్ప్రచారం తగదు: మంత్రి సవిత
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:23 AM
ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారాలు చేస్తూ, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని, ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
సిద్దవటం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారాలు చేస్తూ, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని, ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (దీక్షాంత్ పరేడ్) ఘనంగా జరిగింది. మంత్రి కానిస్టేబుళ్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6050 పోలీసు పోస్టులను భర్తీ చేసిందని, మరో రెండు వేల ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులను విడుదల చేయనుందని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు