చదువుకోవాలని ఉంది సార్..!
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:45 AM
‘సార్.. నాకు చదువుకోవాలని ఉంది’ అంటూ ఓ విద్యార్థిని ఆవేదన మంత్రి లోకేశ్‌ను కదిలించింది. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా బాలిక ఆచూకీ కనుగొని..
పదో తరగతి విద్యార్థిని అభ్యర్థన.. స్పందించిన మంత్రి లోకేశ్
కొండాపురం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘సార్.. నాకు చదువుకోవాలని ఉంది’ అంటూ ఓ విద్యార్థిని ఆవేదన మంత్రి లోకేశ్‌ను కదిలించింది. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా బాలిక ఆచూకీ కనుగొని.. ఆమె చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వెలిగండ్ల గ్రామానికి చెందిన జి.నాగబ్రహ్మం కుమార్తె సుమశ్రీ పదో తరగతి చదువుతోంది.
ఏడాది క్రితం తల్లి మృతి చెందడంతో ప్రస్తుతం సుమశ్రీ తన తమ్ముడితో కలిసి నాయనమ్మ గోవిందమ్మ వద్దే ఉంటోంది. దసరా సెలవుల తర్వాత తన కుమార్తె తన వద్దే ఉండి చదువుకుంటుందని పట్టుబట్టిన నాగబ్రహ్మం.. సుమశ్రీని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ ఆమెను స్కూలుకు పంపించడం లేదు. దీంతో ‘నాకు చదువుకోవాలని ఉంది సార్..’ అంటూ ఇటీవల సుమశ్రీ ‘ఎక్స్’ వేదికగా మంత్రి లోకేశ్‌ను వేడుకుంది. దీంతో బాలిక వివరాలు సేకరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్