Share News

పవనన్న ఆలోచనతో పల్లెల ప్రగతిపథం: లోకేశ్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:54 AM

సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ....

పవనన్న ఆలోచనతో పల్లెల ప్రగతిపథం: లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పల్లెపండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘పవనన్న ఆలోచన, కార్యాచరణతో పల్లెలు ప్రగతిపథంలో పయనించనున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

టాప్‌ ట్రెండింగ్‌లో పల్లె పండుగ

కూటమి ప్రభుత్వం మంగళవారం నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన పల్లెపండుగ 3.0కి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభించింది. ఈ అంశం రోజంతా టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే.. రెండేళ్ల కాలంలోనే 6500 కిమీ సీసీ రోడ్లు వేసిన ఘనత ఎన్‌డీఏది. అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బు వైసీపీ దొంగల జేబుల్లోకి వెళ్తే.. ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బు పనుల రూపంలో కనిపిస్తోంది.

గత పాలకులు ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను దెబ్బతీశారు. పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజు వాటిని మళ్లీ వెనక్కి రప్పిస్తున్నాం. రెండేళ్ల కాలంలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం.

- సీఎం చంద్రబాబు


  • పల్లెకు పండుగ తెచ్చె..

  • ఉదయగిరికి తరలొచ్చిన రైతులు

మిట్టమధ్యాహ్న సమయం. ఒకవైపు ఎండ, మరోవైపు పడమటి గాలులు మంట పుట్టిస్తున్నా, జనం లెక్కచేయలేదు. పల్లెపండుగ 3.0 కార్యక్రమం ప్రారంభానికి భారీగా తరలివచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల కోసం నిరీక్షించారు. ఇంత భారీ స్థాయిలో జనం రావడం ఉదయగిరి చరిత్రలో ఇదే తొలిసారి. జనం భారీగా తరలి వస్తారన్న అంచనాతో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణం లోపల వేలాదిమంది కూర్చునే వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే అంచనాలకు మించి జనం తరలివచ్చారు. దీంతో ఉదయగిరి రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పోలవరం లెఫ్ట్‌కెనాల్‌, వెలిగొండ ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు సభలో రైతులు లేచి నిలబడి తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. భుజంపైన ఉన్న కండువాలను ఊపుతూ తమ సంతోషం ప్రకటించారు.

పార బట్టిన బాబు, పవన్‌, మాధవ్‌

పల్లెపండుగ 3.0 ప్రారంభ సూచికంగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌్‌, మాధవ్‌ ఉపాధి శ్రామికులతో కలిసి పలుగు పార చేతపట్టారు. అనంతరం 11,085 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 03:58 AM