Share News

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలిమెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:25 AM

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలిమెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలి

వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్‌

విజయవాడ(గాంధీనగర్‌), నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. పీపీపీ పేరుతో ప్రజల సొమ్మును, సమాజ సంపదను కొన్ని బడా సంస్థలకు కట్టబెడితే పౌర సమాజం మౌనంగా ఉండదన్నారు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను రక్షించుకునేందుకు తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్షణరెడ్డి మాట్లాడుతూ, ఎకరానికి రూ.100 లీజుతో 500 ఎకరాలను బడా సంస్థలకు 66 సంవత్సరాలపాటు ఇవ్వాలని, కాలేజీ సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని భావిస్తోందన్నారు. ఇదికాక వయోబిలిటి గ్యాప్‌ ఫండ్‌ పేరుతో మరో రూ.1600 కోట్ల ప్రజల సొమ్మును ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 05:29 AM