సహస్ర దీపాలతో అమ్మకు నివాళి
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:47 AM
అమ్మను మరువలేక, ప్రేమతో ఆమెకు గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు చేయడమేకాక ఆమె జన్మదిన వేడుక సందర్భంగా సహస్ర దీపాలతో శనివారం ఘనంగా నివాళి
అమ్మను మరువలేక, ప్రేమతో ఆమెకు గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు చేయడమేకాక ఆమె జన్మదిన వేడుక సందర్భంగా సహస్ర దీపాలతో శనివారం ఘనంగా నివాళి అర్పించాడు ఆమె కుమారుడు. ఈ సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ర్యాలి గ్రామానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు చింతా శ్యామ్‌కుమార్ తమ తల్లి నాగవీరమణి కోసం కట్టించిన ఆలయంలో శనివారం అమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సహస్ర జ్యోతులతో అమ్మ ఆకారంలో వెలిగించి అమ్మకు జన్మదిన వేడుకలు సందర్భంగా ఘన నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు మంకీ క్యాప్‌లు, విద్యాసామగ్రి పంపిణీచేశారు.
- ఆత్రేయపురం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం