Share News

దారుణం.. అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపిన భర్త

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:05 PM

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

దారుణం.. అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపిన భర్త
Machilipatnam Incident

కృష్ణా, అక్టోబర్ 20: జిల్లాలోని మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మచిలీపట్నంలోని చమ్మనగిరిపేటలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని అడ్డాల విజయ రమదుర్గాదేవి(31)గా, నిందితుడిని మండలి శ్రీరామ్(33)గా గుర్తించారు. 2024 డిసెంబర్‌లో వీరిద్దరికీ వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై శ్రీరామ్ అనుమానం పెంచుకోవడంతో తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఈ క్రమంలో దంపతులు కొంతకాలం పాటు వేర్వేరుగా ఉన్నారు. అనంతరం ఆగస్టు 3 నుంచి మచిలీపట్నంలోని చమ్మనగిరిపేటలో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నట్లు తెలిసింది.


ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 7:30 గంటల నుంచి 8:00 గంటల మధ్య విజయ రమదుర్గాదేవి హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య గతంలో జరిగిన గొడవలు, ఇతర కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్‌.పేట సీఐ ఏసుబాబు మీడియాకు వెల్లడించారు. కుటుంబ కలహాలు, అనుమానాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

Updated Date - Oct 20 , 2026 | 06:12 PM