Share News

Love Marriage: సినిమాను మించి సీన్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని..

ABN , Publish Date - Jan 01 , 2026 | 09:07 PM

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిదేళ్లుగా ప్రేమ ప్రయాణం సాగించారు.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవ్వగా.. సినిమా తరహాలోనే కాళ్లు విరగ్గొడతామంటూ అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు పడ్డారు. పెద్దలు పెళ్లికి అడ్డుగా ఉన్నారని భావించిన ఆ ప్రేమ జంట..

Love Marriage: సినిమాను మించి సీన్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని..
Love marriage news

ఏలూరు, జనవరి 1: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిదేళ్లుగా ప్రేమ ప్రయాణం సాగించారు.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవ్వగా.. సినిమా తరహాలోనే కాళ్లు విరగ్గొడతామంటూ అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు పడ్డారు. పెద్దలు పెళ్లికి అడ్డుగా ఉన్నారని భావించిన ఆ ప్రేమ జంట.. ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. తాళి కట్టి, దండలు మార్చుకునే వీడియోలు పొటోలు తీసి వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే కుటుంబ సభ్యుల సాయంతో ఆ జంటను పట్టుకున్నారు. యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యవతని బలవంతంగా కారులో ఎక్కించుకు తీసుకెళ్లిపోయారు. అచ్చం సినిమాలో చూసే సన్నివేశాలు అక్కడ తమ కళ్ల ముందే జరిగిన తీరు చూసి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రేమికుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఏలూరు జిల్లాలో ముసునూరు మండలం రమణక్కపేటలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. వివాహం చేసుకున్న పల్లం సాయిచంద్, రమణక్కపేట ఉప తపాలా కార్యాలయంలో పోస్టు ఉమెన్‌గా పనిచేస్తున్న సాయి దుర్గ, తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం యువకుడు, యువతి రమణక్కపేట పోస్టాఫీసు వద్ద ఉండగా యువతి తల్లిదండ్రులు వచ్చి యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాం పోయేలా కొడతారా అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన కుందుల సాయిదుర్గ, రమణక్కపేట ఉప తపాల కార్యాలయంలో పోస్టు ఉమెన్‌గా పని చేస్తోంది. విద్యావంతురాలైన ఆమె, అదే గ్రామానికి చెందిన పల్లం సాయి చంద్‌ ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.


వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం ఆకర్షణ మాత్రమే కాదని, 8 ఏళ్ల సుదీర్ఘ కాలం నిరూపించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో చివరకు ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదలతో గత మంగళవారం ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. తమ వివాహం పట్ల ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట, ఆ మధుర స్మృతులను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలను చూసిన అమ్మాయి బంధువులు తమ మాట కాదని పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఆ ఫొటోలను బహిరంగంగా ఉంచడం యువతి బంధువులకు ఆగ్రహాన్ని కలిగించింది.


పెళ్లి జరిగిన మరుసటి రోజు బుధవారం సాయి చంద్‌ రమణక్కపేట పోస్టాఫీసు వద్ద ఉన్న సమయంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. చుట్టుపక్కల జనం చూస్తుండగానే, అతడిని ఒక స్తంభానికి కట్టేసి కర్రలు, రాళ్లతో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, యువకుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తమ కూతురుని బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోయారు.


సాయి చంద్ ప్రేమకు, వివాహానికి సహకారం అందించారనే అనుమానంతో పోస్ట్ ఆఫీస్ లో పని చేసే చెన్నకేశ్వరి అనే ఉద్యోగినిపై కూడా వారు దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా ఉద్యోగినిపై ఇలాంటి దాడి జరగడం పోస్టల్‌ శాఖ సిబ్బందిలో కూడా భయాందోళనలు రేకెత్తించింది. తీవ్రంగా గాయపడిన సాయిచంద్‌, చెన్నకేశ్వరిని స్థానికులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసుల పాత్రపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


వివాహం జరిగిన వెంటనే తమకు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని సాయిచంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయినప్పటికీ మరుసటి రోజే ఇంత పెద్ద దాడి జరగడంతో ఇప్పుడు పోలీసులు తీరును గ్రామస్తులు తప్పు బపడుతున్నారు. దొంగను కొట్టినట్లు స్తంభానికి కట్టేసి విచక్షణరహితంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో తిరిగి.. ఆ తర్వాత మోసం చేసి వెళ్లిపోయే ఈరోజుల్లో.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. బాధ్యతతో పెళ్ళి చేసుకుని.. కొత్త జీవితాన్ని ఇచ్చిన యువకుడిపై ఇలా దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.


Also Read:

Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Thyroid Diet: శీతాకాలంలో థైరాయిడ్ బాధితులు వీటిని తినకూడదు

Updated Date - Jan 01 , 2026 | 09:08 PM