Share News

తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:00 AM

తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట వద్దకు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చిరుత వచ్చి గోపురానికి సమీపంలో ఉన్న మెట్ల గోడపై కొంతసేపు కూర్చుంది.

తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం

తిరుమల, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట వద్దకు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చిరుత వచ్చి గోపురానికి సమీపంలో ఉన్న మెట్ల గోడపై కొంతసేపు కూర్చుంది. భద్రతా సిబ్బంది గుర్తించి అటవీ అధికారుల సహకారంతో చిరుతను అడవిలోకి వెళ్లిపోయేలా సైరన్లు వేశారు. ఇటీవల గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చిరుతలు అధికంగా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:00 AM