Share News

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:40 PM

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి గుంటూరు కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై 25న తీర్పు వెలువడే అవకాశం ఉంది.

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ
Lella Appireddy Police Custody

గుంటూరు, నవంబర్ 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కేసు విచారణలో భాగంగా లేళ్ల అప్పిరెడ్డిని మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, 3 రోజుల కస్టడీకి అనుమతించింది.

ప్రస్తుతం రాజమండ్రి జైలులో: ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పిరెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.

25న బెయిల్ పిటిషన్‌పై తీర్పు: మరోవైపు, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగియగా, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 25వ తేదీన బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.

పరిషత్ ఎన్నికల పోలింగ్ అనంతరం వెంగళాయపాలెం నుంచి బ్యాలట్ బాక్సులను పోలీసులు, సిబ్బంది తరలిస్తుండగా, అడ్డగించడం, బ్యాలట్ బాక్సులను ఆధీనంలోకి తీసుకోవడం, తదితర ఆరోణలపై అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (Lella Appireddy Police Custody)


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 05:47 PM