ఇంద్రకీలాద్రిపై లడ్డూల ఏటీఎంలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:57 AM
దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులకు లడ్డూల విక్రయానికి ఏటీఎం సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం క్యూల్లో గంటల తరబడి వేచిఉండే అవసరం లేకుండా స్మార్ట్ విధానంలో త్వరితగతిన సేవలు పొందేలా దీన్ని రూపొందించారు.
దసరా శరన్నవరాత్రుల్లో అందుబాటులోకి
ఒక్కో బాక్స్‌లో ఆరు లడ్డూలు.. వెల రూ.100
(ఆంధ్రజ్యోతి - విజయవాడ): దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులకు లడ్డూల విక్రయానికి ఏటీఎం సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం క్యూల్లో గంటల తరబడి వేచిఉండే అవసరం లేకుండా స్మార్ట్ విధానంలో త్వరితగతిన సేవలు పొందేలా దీన్ని రూపొందించారు. ఈ లడ్డూ ఏటీఎంలను ప్రస్తుతం పోలీసు కమిషనర్ కార్యాలయంలో పరిశీలన నిమిత్తం అందుబాటులో ఉంచారు. ఈ ఏటీఎంలు పెద్ద ఫ్రిజ్ మాదిరిగా ఉండి, అరలను కలిగి ఉంటాయి. ఆరు లడ్డూలతో ప్యాక్ చేసిన బాక్స్‌లను ఈ అరల్లో ఉంచుతారు. ఏటీఎం స్ర్కీన్‌పై ఎన్ని బాక్స్‌లు కావాలో భక్తులు ఎంపిక చేసుకోవాలి. వాటిని ఓకే చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ తెరుచుకుంటుంది. దానిద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలి. ఆ మేరకు లడ్డూల బాక్స్‌లు బయటకు వస్తాయి. దీనిద్వారా భక్తులు సత్వరమే లడ్డూలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య