Share News

ఫుట్‌బాల్‌ విజేత ఎమ్మిగనూరు జట్టు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:42 AM

ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను పురష్కరించుకొని దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన చైతన్య జట్టు విజయం సాధించగా, రన్నర్‌గా కర్ణాటకలోని హోబ్బళ్లి జట్టు నిలిచింది.

ఫుట్‌బాల్‌ విజేత ఎమ్మిగనూరు జట్టు
విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను పురష్కరించుకొని దివంగతనేత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన చైతన్య జట్టు విజయం సాధించగా, రన్నర్‌గా కర్ణాటకలోని హోబ్బళ్లి జట్టు నిలిచింది. నాలుగు రోజులుగా రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన 36 ఫుట్‌బాల్‌ జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఎమ్మినూరు చైతన్య జట్టు ఒక గోల్‌ కొట్టి హుబ్బళ్ళి జట్టుపై విజయం సాధించింది. అలాగే మూడో స్థానంలో హసన్‌కు చెందిన నైక్‌ ఎఫ్‌సీ నిలువగా, నాలుగో స్థానంలో నల్గొండ జిల్లా చెట్టూరు జట్టు నిలించింది. విజేతలకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి షీల్డ్‌, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీవీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిర్వాహకులు రామకృష్ణ నాయుడు, కామార్తి మహేష్‌, ఉప్పర వీరేష్‌, అబ్దుల్లా, వీరేష్‌, నరేష్‌, ఈరన్న, జిలాన్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్‌, నాయకులు ఎంబీ మహేష్‌, మల్లయ్య ఉరుకుందయ్య శెట్టి, కలీముల్లా, రంగస్వామి గౌడ్‌, మిన్నప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:48 AM