ఓటు చోరీని అడ్డుకోవాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:38 AM
ఓటు చోరీని అడ్డుకోవమే బీఎల్‌ఏల ప్రధాన బాధ్యతని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు అన్నారు.
కర్నూలు అర్బన్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఓటు చోరీని అడ్డుకోవమే బీఎల్‌ఏల ప్రధాన బాధ్యతని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతి నాయుడు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ పార్టీ కళ్లు, చెవులుగ పని చేసే బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని, బూత్ పరిధిలోని తుది ఓటర్ల జాబితాను పూర్తిగా స్టడీ చేయాలని సూచించారు. డూప్లికేట్ ఎంట్రీలు ఉంటే వెంటనే అభ్యంతరం తెలిపాలన్నారు. రోజు వారీ పోలింగ్ తమ బూత్‌కు సంబంధించిన సమస్యలు, వాట్సప్ గ్రూప్‌ద్వారా బూత్ స్థాయి సమాచారాన్ని వెంటనే పై స్థాయికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా, కోడుమూరు ఇన్‌చార్జి అశోకరత్నం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు బి. బ్రతుకన్న, బజారన్న, షేక్ ఖాజా హుస్సేన్, మల్లికార్జున యాదవ్, సూర్యప్రకాష్‌రెడ్డి, సాంబశివుడు, భాగ్యలక్ష్మి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.