Share News

వైభవంగా విశ్వకర్మ యజ్ఞం

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:00 AM

శ్రీశైలం విశ్వబ్రాహ్మణ సత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ విశ్వశాంతి జరగాలని పంచముఖాలతో స్వయంభువుగా వెలసిన విశ్వకర్మ భగవాన్‌ స్వామివారి మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.

వైభవంగా విశ్వకర్మ యజ్ఞం
శ్రీశైలం విశ్వబ్రాహ్మణ సత్రంలో హోమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు

శ్రీశైలం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం విశ్వబ్రాహ్మణ సత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ విశ్వశాంతి జరగాలని పంచముఖాలతో స్వయంభువుగా వెలసిన విశ్వకర్మ భగవాన్‌ స్వామివారి మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. మానవాళి సుభిక్షంగా వర్ధిల్లాలని సంకల్పాన్ని పఠించిన వేదపండితులు విశ్వకర్మ భగవాన్‌ సుప్రభాతసేవ, గణపతిపూజ, పుణ్యవచనం, కళశపూజ, పతాకావిష్కరణ, హోమ కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు ముత్తలూరి బలయ్య, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి నర్సింహ ఆచారి, మల్లేశ్వరరావు, రమేష్‌, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 01:01 AM