Share News

వైద్యుల సేవలు అభినందనీయం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:48 AM

వైద్యుల సేవలు అభినందనీయమని ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

వైద్యుల సేవలు అభినందనీయం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎంపీ బైరెడ్డి శబరి

నంద్యాల టౌన్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): వైద్యుల సేవలు అభినందనీయమని ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తిరుమల పునీత్‌ ఆసుపత్రిలో ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. నంద్యాల వైద్యులు వైద్య శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు దేశ రక్షణలో పని చేస్తున్న త్రివిధ దళాల ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత ఓపీడీ సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే వైద్యులకు ఆదర్శంగా నిలిచార న్నారు. అనంతరం కేక్‌ చేశారు. సుమారుగా 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రూ.లక్ష విలువ చేసే మందులు అందజేశారు. 70 మందికి అవసరమైన వినికిడి పరీక్షలు చేసి పరికరాలు అందజేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.జి.రవికృష్ణ, డా.అనిల్‌కుమార్‌, వైద్యులు మధుసూదన్‌రెడ్డి, భార్గవర్థన్‌రెడ్డి, విజయబాబు, మాధవి పాల్గొన్నారు.

నంద్యాల టౌన్‌: వైద్యుల దినోత్సవాన్ని పట్టణ శివారులోని వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైద్యులను సన్మానించారు. తర్వాత అన్నదానం చేశారు. వైద్యులు నర్మద, అరుణ కుమారి, విజయబాబు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ దస్తగిరి, సభ్యులు సత్యనారాయణ, ఇషాక్‌వలి, పాల్గొన్నారు.

గోస్పాడు: గోస్పాడు మండలం బాబానగర్‌ వద్ద ఉన్న గురు రాజా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వైద్యుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల సేవలు అందించిన వైద్యులను సన్మానంచారు. వైద్యులు చిన్నారులకు వైద్య పరికరాలు అందజేశారు.

పాణ్యం: సుగాలిమెట్టలో బుధవారం డాక్టర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. బంజారా సేవాసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మోడల్‌ పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పలకలు పంపిణీ చేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో మోడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ దినేష్‌బాబును సన్మానించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థినికి దుస్తులు, పుస్తకాలు అందజేశారు. హెచ్‌ఎం కరుణాకర్‌, తిరుపాల్‌ నాయక్‌, మోహన్‌నాయక్‌, రాజానాయక్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:48 AM