ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - May 21 , 2026 | 12:23 AM
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్‌ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
మిడుతూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్‌ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఖాజిపేట గ్రామ పొలిమేరలో జరుగుతున్న ఉపాధి పనుల దగ్గరకు వెళ్లి శ్రామికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వికసిత్ భారత్ జీ రాంజీ పథకం రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని అన్నారు. ఉపాధి పనుల్లో ఉపాధి కూలీలకు పనిముట్లు అందించాలని, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 వేతనం అందించాలన్నారు. పని చోట ప్రమాదంలో మరణించిన శ్రామికులకు రూ.30 లక్షలు, గాయపడితే రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. గోవిందమ్మ, స్వాములు, వడ్డె వెంకటేశ్వర్లు, చిన్నమ్మ, రాణెమ్మ, లక్ష్మీదేవి, సీతరాముడు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.