ప్రజలు గుణపాఠం చెబుతారు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:11 AM
దేశంలో బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో చేసిందేమీు లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
మంత్రాలయం, జూలై 28(ఆంధ్రజ్యోతి): దేశంలో బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో చేసిందేమీు లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం మంత్రాలయంలో హెచ్‌ఆర్‌బీ కళ్యాణ మంటపంలో మూడు రోజులు ఏర్పాటుచేసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారం భిస్తూ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారు తున్న సమాజానికి తగినట్లు కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొన్ని దుష్టశక్తులు అయోధ్య రామాలయం కానుకలను దోచుకున్నాయని ఆరోపించారు. మహిళలపై దాడులు, అత్యా చారాలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించ డంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్త పాదయాత్రలు చేపట్టి సెప్టెంబరు 1న ఛలో ఢిల్లీ చేపడుతామని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతుల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, పంపన్నగౌడు, రామచంద్రయ్య, మునెప్ప, భీమలింగప్ప పాల్గొన్నారు.