అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 12:24 AM
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనుల, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తుగ్గలి, మే 22 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనుల, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని జొన్నగిరిలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ లిక్కర్ కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తే నిజాలు బయట పెట్టి జైలుకు పంపుతామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులు వంద శాతం గెలుపొందాలన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ప్రమాద బీమా అందించడమే కాక వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేయడమే కాకుండా అభివృద్ది పనులు చేయిస్తుండటంతో ఓర్వలేక జగన్ బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, ప్రముఖ విరాళ దాత పారా విశ్వనాథ్ (చిట్టెన్న), నాయకులు మనోహర్ చౌదరి, మిద్దెవెంకటేష్, బాలన్న, అప్పా వేణుగోపాల్, తిరుపాల్ నాయుడు, వెంకటస్వామి, చంద్రన్న ఉన్నారు.