Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:59 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు, నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్‌, ఆరోగ్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం ఏసి చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:59 PM