బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - May 21 , 2026 | 12:19 AM
వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, మే 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమ లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని అల్లూరు గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎమెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మధ్య తలెత్తిన వివాదం కారణంగా అతనిని కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపి అఽధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక ప్రమాదంగా చిత్రీక రించడానికి శతవిధాల ప్రయత్నించారని, అయినా దర్యాప్తులో అన్నీ బయటపడ్డాయని అన్నారు. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ అనస్థిటిస్ట్ కోవిడ్ 19 సమయంలో పీపీఈ కిట్ల కొరత గురించి ఆందోళనలు లేవనెత్తిన సస్పెన్షన్‌కు గురై, అరెస్టు కూడా చేశారని, చివరకు ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే ముఖ్యంగా ఎస్సీ వ్యక్తులు, వృత్తిపరమైన నిపుణులు, ఆర్థికంగా వెనబడిన వర్గాలపై వైసీపీ హయాంలో నిరంతర బెదిరింపులు, దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాదరెడ్డి, నాయకులు మహేశ్వరెడ్డి, శ్రీనివాసులు, దేవసహాయం నాయకులు పాల్గొన్నారు.