డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:40 AM
పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్, గాంధీనగర్‌లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.
నందికొట్కూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్, గాంధీనగర్‌లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. పట్టణంలోని బైరెడ్డి శేషశయనారెడ్డి నగర్, గాంధీ నగర్‌లలో సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ నాయకులు బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయా కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శేషశయనారెడ్డి నగర్ ఏర్పడి దాదాపు 30ఏళ్లు దాటినా వర్షం కురిస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. డ్రైనేజీలను వెడల్పు చేసి వర్షపు నీటిని కాలువల్లోకి మళ్లించాలన్నారు. పార్టీ మండల కార్యదర్శి సామన్న, నాయకులు షేక్షావలి, రెహమాన్, షేక్ మహబూబ్ బాషా, మహ్మద్ బాషా, షేక్ బేబీ, నూర్జహాన్, శిరీష, నాగమునెమ్మ, మల్లేశ్వరమ్మ, రోజమ్మ తదితరులు పాల్గొన్నారు.