పంటల బీమా గడువు పొడిగించాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:04 AM
పత్తి, వేరుశనగ, టమోటా వంటి ప్రధాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం విధించిన గడువు చాలా తక్కువగా ఉందని, దానిని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాలంటూ రైతులు కోరారు.
ఆదోని, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పత్తి, వేరుశనగ, టమోటా వంటి ప్రధాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం విధించిన గడువు చాలా తక్కువగా ఉందని, దానిని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాలంటూ రైతులు కోరారు. ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా చేపట్టారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాతలు బీమా ప్రీమియం చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలన్నారు. లేనిపక్షంలో వచ్చే సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.