Share News

ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులే

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:51 PM

ఉపాధ్యాయులు ప్రతి క్షణం తమను అప్‌డేట్‌ చేసుకుంటూ నిరంతరం విద్యార్థులుగా బోధనలో అవగాహన పెంచుకోవాలని డీఈవో సుధాకర్‌ తెలిపారు.

ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులే
మాట్లాడుతున్న డీఈవో సుధాకర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ప్రతి క్షణం తమను అప్‌డేట్‌ చేసుకుంటూ నిరంతరం విద్యార్థులుగా బోధనలో అవగాహన పెంచుకోవాలని డీఈవో సుధాకర్‌ తెలిపారు. మంగళవారం స్థానిక నన్నూరు టోల్‌గేటు వద్ద ఉన్న రాఘవేంద్ర బీఈడీ కళాశాలలో రెండు రోజుల ఉపాధ్యాయుల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా, 21వ శతాబ్దపు నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం మారిన 6, 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాలు, అందులోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని విద్యార్థులకు బోధించే విషయంలో తగిన మెళుకువలు నేర్చుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ఈ సంవ త్సరం జూలై 13 నుంచి నవంబరు 13వ తేదీ వరకు మిషన్‌ మార్చి పేరిట అందిస్తున్న స్టడీ మెటీరియల్‌, స్లిప్‌ టెస్టులను సబ్జెక్టుల వారీగా నిర్వహించి విద్యార్థుల్లో మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణలో డీసీఈబీ సెక్రటరీ నాగరాజు, ఏఎంవో రఫీ, రీసోర్స్‌ పర్సన్‌ వినోద్‌ కుమార్‌, రాజశేఖరప్ప, ఆదోని, పత్తికొండ డివిజన్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:51 PM