Share News

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:45 AM

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సీసీ రోడ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరురూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. కరివేన గ్రామంలో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను బుధవారం ప్రారంభించారు. టీడీపీ నాయకులు దినకర్‌, రవినాయక్‌, కొండలరావు, శరత్‌, శివశంకరశర్మ, నాగేంద్రరావు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణిలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. కరివేన గ్రామంలో బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ నూతన ఫింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 12:45 AM