Share News

కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:13 AM

పీలేరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్‌ చేశారు.

కఠినంగా శిక్షించాలి
ఆలూరులో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పీలేరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్‌ చేశారు. న్యాయవాది హత్యను నిరసిస్తూ గురువారం పత్తికొండ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. మధుబాబు మాట్లా డుతూ న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, న్యాయ వాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు కృష్ణ, సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, రంగస్వామి, జగదీశ్‌, నరసారావు, రవి, అరుణ్‌కుమార్‌, వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆలూరు రూరల్‌: పీలేరు బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది హత్యను ఖండిస్తూ ఆలూరులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిలో నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులకు భద్రత హామీ ఇవ్వాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులు లక్ష్మీకాంత్‌, వాయుజీవోత్తమ రావు, షాకీర్‌, వెంకటేశ్వర్లు, రవి, షేక్షావలి పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:13 AM