Share News

మహిళల రక్షణకు శక్తి టీమ్‌లు: డీఎస్పీ

ABN , Publish Date - May 07 , 2026 | 12:00 AM

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్‌లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు.

మహిళల రక్షణకు శక్తి టీమ్‌లు: డీఎస్పీ
ప్రాతకోటలో మాట్లాడుతున్న డీఎస్పీ రామాంజినాయక్‌

పగిడ్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్‌లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు. బుధవారం ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర ఆధ్వర్యంలో ప్రాతకోట గ్రామంలో మహిళల భధ్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైన మహిళలు ఒంటరిగా ఉండి ఇతరులతో ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తినప్పుడు శక్తి టీమ్‌కు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతకై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, శక్తి యాప్‌ గురించి, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. మహిళలు గృహహింసకు గురైనప్పుడు చేయవలసిన చర్యలను ఆయన వివరించారు. కార్యక్రమంలో నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రహ్మణం, పగిడ్యాల ఎంపీడీవో సుమిత్రమ్మ, డిప్యూటీ తహసీల్దార్‌ మురళి పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 12:00 AM