Share News

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:50 AM

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌
చెత్త బుట్టలు అందజేస్తున్న కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. శనివారం స్వచ్ఛాంద్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం దేవనగర్‌లోని చైతన్య మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించి వాటి పాముఖ్యం గురించి వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణ శాస్త్రీయంగా, క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1363 ప్రభుత్వ పాఠశాలల్లో, 1663 అంగన్‌వాడీ కేంద్రాలు, 153 సంక్షేమ వసతి గృహలు, సహ గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం చేర్చినట్లు తెలిపారు. అనంతరం మెప్మా సిబ్బందికి చెత్త బుట్టలు, పారిశుధ్య కార్మికులకు శానిటైజేషన్‌ సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో మెప్మా సీఎంఎం భాస్కర్‌రెడ్డి, మెప్మా సిబ్బంది, మున్సిపల్‌ డీఈ నాగభూషణంరెడ్డి, నాయకులు ఆ వార్డు కౌన్సిలర్‌ జైనాబీ, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దస్తగిరి, సుబ్బయ్య పాల్గొన్నారు.

పాణ్యం: పారిశుధ్యంతోనే ఆరోగ్యం సాధ్యమని పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వేణుగోపాల్‌ అన్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్రం పరిసరాలలో మొక్కలు నాటి, పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంపీటీసీ రంగరమేష్‌, టీడీపీ జిల్లా కార్యదర్శి రమణమూర్తి, సుభాన్‌, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:50 AM