Share News

ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బుడ్డా

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:32 AM

నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బుడ్డా
ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టీడీపీలోకి చేరిన మహిళలు

ఆత్మకూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీశైలం రస్తాలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో పరిమల, లక్ష్మీ, సుబ్బమ్మ, షమియూన్‌, దౌలత్‌బీ తదితరుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలతో పాటు కురుకుంద గ్రామానికి చెందిన వంద కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. వారికి ఎమ్మెల్యే బుడ్డా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ మున్సిపాలిటీలో పొదుపు సంఘాల ప్రక్షాలన పూర్తి కాలేదని, త్వరలోనే వాటన్నింటిని బాగుపరిచి ప్రతిఒక్క సభ్యురాలికి బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ నుంచి నిధులను మంజూరు చేసేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలను అస్ర్తా లుగా చేసుకుని వైసీపీ గెలుపొందాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి అపోహలను, అబద్ధాలను నమ్మి మోసపోవద్దని సూచిం చారు. అంతకుముందు మహిళలు ఎమ్మెల్యే బుడ్డాను సత్కరించారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు భాస్కర్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 20 , 2026 | 12:32 AM