ప్రజా సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:37 AM
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. పట్టణంలోని ఓ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన చెప్పాం! చేస్తున్నాం!! ప్రగతి నివేదిక పోస్టర్‌ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు కూటమికి విజయాన్ని అందించారన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ సంక్షేమ- అభివృద్ధి- సుపరిపాలనతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు. పల్లెలు, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డా.బాబన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నంద్యాల సమన్వయకర్త పిడతల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.