Share News

చెక్క రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:24 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు.

  చెక్క రథంపై ప్రహ్లాదరాయలు
చెక్క రథంపై విహరిస్తున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు. ఆదివారం ధనుర్మాసం అష్టమి శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో పండితులు, అర్చకులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్క రథంను వివిధ పుష్పాలతో చూడ ముచ్చటగా అలంకరించి, వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్ఠించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల మంటపంలో ఊంజలసేవ నిర్వహించారు. అంతక ముందు స్వామికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించి హారతులు ఇచ్చారు.

Updated Date - Jan 11 , 2026 | 11:24 PM