Share News

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:20 AM

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ రెడ్డి తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
మాట్లాడుతున్న సీఎంఎం విజయభాస్కర్‌ రెడ్డి

నంద్యాల టౌన్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ రెడ్డి తెలిపారు. బ్రిక్స్‌ సుస్థిర జవన శైలి వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని బొమ్మలసత్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈకార్యక్రమాన్ని ఈనెల 7వ తేది వరకు నిర్వహిహిస్తామని, ప్రతి రోజు ఒక కార్యక్రమంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యకరమైన జీన శైలి అలవర్చుకోవడం, శారీరక వ్యాయామం, సుస్థిర ఆహార విధానాలు, ప్లాస్టిక్‌కు నో చెప్పడం, ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలను తగ్గించడం, పరిశుభ్రంగా, చిరు ధన్యాలను ఉత్పత్తులను పెంచడం, వంటి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, సీవో సుబ్బయ్య, ఆర్‌పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:20 AM