రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:06 AM
చర్చిల్లో ప్రార్థనలు ముగిం చుకొని స్వగ్రామానికి వెళ్తూ తల్లీకూతురు అనంతలోకాలకు చేరారు.
నంద్యాల క్రైం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చర్చిల్లో ప్రార్థనలు ముగిం చుకొని స్వగ్రామానికి వెళ్తూ తల్లీకూతురు అనంతలోకాలకు చేరారు. ఈ హృదయ విదారక ఘటన శుక్రవారం నంద్యాల మం డలం బ్రాహ్మణపల్లె-మద్దూరు గ్రామాల మధ్య చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. పాణ్యం మండలం గోనవరం గ్రామానికి చెందిన తిమ్మపోగు లలితమ్మ(38), లక్ష్మి(18) తల్లీకూ తురు. నంద్యాలలోని ఓ చర్చిలో ప్రార్థనలు ఉంటే వెళ్లారు. కార్యక్ర మం ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. గ్రామానికి వెళ్తున్న సమయంలో ఓవ్యక్తి వీరికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. బ్రాహ్మ ణపల్లె -మద్దూరు గ్రామాల మధ్య వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు తీవ్రగాయాలతో అక్క డికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయా లయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట నాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నం ద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్, పరారైన బైక్ రైడర్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గోనవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.