క్రీడలతో మానసికోల్లాసం: డీఎస్‌డీవో
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:37 PM
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు.
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ ఔట్‌డోర్ స్టేడియంలో నిషా ముక్త్ యువ వికసిత్ భారత్ ఆధ్వర్యంలో 2026 స్పోర్ట్స్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్‌డీవో భూపతిరావు, శాయ్ హాస్టల్ ఇన్‌చార్జి కార్తికేయన్, మేరా యువ భారత్ (ఎన్‌వైకేఎస్) జిల్లా అధికారి ఐజయ్య హాజరై ప్రసంగించారు. వాలీబాల్, అథ్లెటిక్స్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు షీల్డ్స్ అందజేశారు.
విజేతలు: పరుగు పందెం- బాలుర విభాగంలో కిషోర్, పవన్, శివ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో చంద్రిక, గిరిజ, హరిత మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. షాట్‌ఫుట్‌లో బాలురులో శ్రీహరి, రవికుమార్, అబ్దుల్లా.. బాలికల విభాగంలో సాయి ఇమాంబీ, నాగవేణి, సౌమ్య, వాలీబాల్‌లో బాలురు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, బాలికల విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ కల్లూరు జట్టు నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.