Share News

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:02 AM

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకోవాలని ఉత్సవ సమితి నాయకులు తీర్మానం చేశారు.

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం
సమావేశంలో పాల్గొన్న ఉత్సవ సమితి నాయకులు

ఆదోని టౌన్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకోవాలని ఉత్సవ సమితి నాయకులు తీర్మానం చేశారు. గురువారం విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో గణేశ్‌ ఉత్సవ సమితి మొదటి సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇచ్చేలా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వినాయక మండపాల నిర్మాహకులకు సూచించారు. సభ్యులు విజేయుడు, కునిగిరి నీలకంఠ, ఎగ్గటి ప్రతాప్‌, విట్టా రమేష్‌, రామాంజనేయులు, సాయిప్రసాద్‌, ఉపేంద్ర కుమార్‌, గోవిందరాజు గౌడ్‌, గోవిందరావు, బీమారెడ్డి, ఎండీ బసవరాజ స్వామి, బెస్త నాగరాజు, అంజయ్య కుమార్‌, దేవిశెట్టి ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 01:02 AM