Share News

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 12 , 2026 | 12:18 AM

గ్రామీణ ప్రాంతాలలో జరిగే భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడం్బందీగా నిర్వహించాలని బనగానపల్లె ఆర్డీవో వై . నరేంద్రనాథ్‌ రెడ్డి సూచించారు.

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న ఆర్డీవో నరేంద్రనాథ్‌ రెడ్డి

కోవెలకుంట్ల, మే 11 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలలో జరిగే భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడం్బందీగా నిర్వహించాలని బనగానపల్లె ఆర్డీవో వై . నరేంద్రనాథ్‌ రెడ్డి సూచించారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కోవెలకుంట్ల, సంజామల మండలాలకు చెందిన వీఆర్వోలు, వీఎస్‌ఏలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకవస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నారు. విధుల్లో అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవమని హెచ్చరించారు. జనాభా సర్వేను కూడా పడక్బంధీగా నిర్వహించి, నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు. కోవెలకుంట్ల, సంజామల తహసీల్దార్లు పవన్‌ కుమార్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:18 AM