ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:00 AM
పత్తికొండ శివారులో నాగమ్మవ్వదేవాలయం పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం భూమిపూజ చేశారు.
పత్తికొండ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ శివారులో నాగమ్మవ్వదేవాలయం పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. రైతు కుటుంబాలు ఆరాధ్య దైవంగా పూజించే నాగమ్మవ్వ దేవాయం పునర్నిర్మాణానికి పొలం యజమానులు 25సెంట్లు స్ధలాన్ని కేటాయించడంతో టీటీడీ ఆలయం పునర్నిర్మాణ పనులకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు. టీడీపీ నాయకులు వెంకటపతి, బత్తిన లోక్‌నాథ్, పుండుకూర బ్రహ్మయ్య, నరసింహచౌదరి, శ్రీకాంత్‌చౌదరి, కడవల సుధాకర్, బీజేపీ నాయకుడు కరణ నరేష్, టీటీడీ ఏఈ నరేష్ తదితరులు ఉన్నారు.