మంత్రాలయం వద్ద విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురి గల్లంతు
ABN , Publish Date - May 30 , 2026 | 06:45 PM
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
కర్నూలు జిల్లా: మంత్రాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలో గల్లంతైన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రాలయంలోని ఓ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు, పూజ అనంతరం సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లి ఈతకు దిగినట్లు సమాచారం. నీటి లోతు అంచనా వేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.
ఈ ఘటనలో ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఒక మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read:
అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం.. ఈ కూరగాయ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర తెలుసా?
మే 31 నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్