Share News

కంటిచూపు ఎంతో విలువైనది

ABN , Publish Date - May 01 , 2026 | 12:09 AM

మనిషి జీవితంలో కంటిచూపు ఎంతోవిలువైనదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

 కంటిచూపు ఎంతో విలువైనది
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): మనిషి జీవితంలో కంటిచూపు ఎంతోవిలువైనదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. యువస్పందన సొసైటీ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు చిట్టెంప్రసాద్‌, చెన్నై శంకర నేత్రాలయం సంయుక్తంగా పత్తికొండ జూనియర్‌ కళాశాల ఆవరణలో 10రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థి చెట్టెం హనుమాన్‌ప్రసాద్‌, శాంతి సుమారు రూ.15 లక్షల ఖర్చుతో ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వారికి స్థానికంగా పూర్వవిద్యార్థులు, యువస్పందన సభ్యులు సహకారం అందించడం ఎంతో అబినందనీయమన్నారు. 10రోజుల పాటు కంటి వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం ఎంతో మంచి కార్యక్రమమని కొనియాడారు. చిట్టెం హనుమాన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ కంటిపరీక్షలు, ఆపరేషన్లకు వచ్చేవారికి ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, అంధుల క్రికెట్‌ ఇండియా టీం సభ్యుడు ప్రేమ్‌కుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంటిచూపు విలువ ఏమిటో తనకు బాగా తెలుసునని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, ప్రిన్నిపాల్‌ నయిమున్సీబేగం, ప్రధానోపాధ్యాయులు వీరేషప్ప, యువస్పందన సభ్యులు సురేంద్ర, లక్ష్మన్‌, నాగరాజు, పూర్వవిద్యార్థులు ఉన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం వంటిదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ క్యాంపు కార్యాయంలో గురువారం ఆయన బాదిత కుటంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదల్ర అభ్యున్నతి కోసం కోసం ప్రభుత్వం అన్నిరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:09 AM