Share News

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:59 PM

స్థానికసంస్థల ఎన్నికలలో నాయకులు గెలుపేలక్ష్యంగా ప్రతి ఒక్కరూ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
తుగ్గలి మండలం నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికలలో నాయకులు గెలుపేలక్ష్యంగా ప్రతి ఒక్కరూ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పిలుపునిచ్చారు. గురువారం పత్తికొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుగ్గలి మండల నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వహయాంలో టీడీపీ గెలుపుకు ప్రతిగ్రామంలో నాయకులు, కార్యకర్తలు పోరాట స్ఫూర్తితో పార్టీగెలుపుకోసం పనిచేసి విజయాన్ని అందించారన్నారు. ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, స్టేట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ మెంబర్‌ వెంకటపతి, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు, నాయకులు తిమ్మయ్యచౌదరి, మనోహర్‌ చౌదరి, ఎర్రగుడి వెంకటస్వామి తదితరులు ఉన్నారు.

ప్రతి విద్యార్థి సేవాబావంతో ముందుకుసాగాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ డే పురస్కరించుకుని గురువారం పత్తికొండ డిగ్రీకళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాదురి, కళాశాల సిబ్బంది, తదితరులు ఉన్నారు.

పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 36 కుటుంబాలకు రూ. 17.20లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు.

పత్తికొండలో సబ్‌ కోర్టు ఏర్పాటుకు సహకారం అందించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు, న్యాయవాదులు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును కోరారు. గురువారం క్యాంపుకార్యాలయంలో న్యాయవాదులు ఎమ్మెల్యేను కలిసి సబ్‌కోర్టు అంశంపై మాట్లాడారు.

Updated Date - Sep 25 , 2026 | 12:03 AM