Share News

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:33 AM

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
అల్లూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు. అల్లూరు గ్రామంలోని మాండ్ర శివానందరెడ్డి నివాసంలో బుధవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలు పార్టీ కోసం రోజుకు గంట సమయం కేటాయించా లని కోరారు. ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు ‘ఇంటింటి ప్రచార కార్యక్రమం’ నిర్వహించబోతున్నామని, విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నందికొట్కూరు, మిడ్తూరు, పగిడ్యాల, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల కన్వీర్లు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, లింగస్వామిగౌడ్‌, మోహన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ప్రసాదరెడ్డి, సొసైటీ చైర్మన్లు ముర్తుజావళి, శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ ఖలీలుల్లాబేగ్‌, లక్ష్మీనారాయణ యాదవ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాణ్యమైన ఆహారం అందించాలి

అంగన్‌వాడీలో చిన్నారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఎమ్మెల్యే జయసూర్య అంగన్‌వాడీలకు సూచించారు. బుధవారం నందికొట్కూరులోని మండల అభివృద్ధి కార్యాలయంలో అంగన్‌వాడీ సెంటర్లకు ఇండక్షన్‌ స్టవ్‌లను అందజేశారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల్లోని 267 అంగన్‌ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టవ్‌లను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, ఐసీడీఎస్‌ సీడీపీవో మంగవళ్లి, నందికొట్కూరు సింగిల్‌విండో సొసైటీ చైర్మన్‌ ముర్తుజావళి, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:33 AM