Share News

ఆలయానికి విరాళం

ABN , Publish Date - May 23 , 2026 | 12:26 AM

నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు.

 ఆలయానికి విరాళం
విరాళం అందిస్తున్న భక్తులు

బనగానపల్లె, మే 22 (ఆంధ్రజ్యోతి): నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు. బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన నుసి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు నుసి వెంకటరెడ్డి, లక్ష్మీదేవమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పీవీకుమార్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ రామసేతు నాగార్జునరెడ్డి సమక్షంలో ఆలయానికి విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణబ్యాంక్‌ శాఖ ఆర్‌ఎం. సుధాకర్‌, ఆధ్వర్యంలో ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పీవీ కుమార్‌రెడ్డి చేతుల మీదుగా రెండు స్టీల్‌ హుండీలు శుక్రవారం విరాళంగా అందించారు. కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజరు లక్ష్మి ప్రసన్న, క్యాషియర్‌ రామలింగేశ్వరుడు, బ్యాంక్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:26 AM