విధుల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:28 AM
విధుల్లో అలసత్వం వద్దని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ శాంతాబాయి అన్నారు.
బండిఆత్మకూరు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): విధుల్లో అలసత్వం వద్దని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ శాంతాబాయి అన్నారు. బండిఆత్మకూరు పీహెచ్‌సీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రిలోని పలు వార్డులను ఆమె పరిశీలించారు. అడిషనల్ ఎడీఎంహెచ్‌వో మాట్లాడుతూ పీహెచ్‌సీ ఫరిధిలో క్షయ వ్యాధిగ్రస్థుల వివరాలు అడిగి, సంబంధి రికార్డులను పరిశీలించారు. అలాగే 28న జరిగే పల్స్‌పోలియో కార్యక్రమం వంద శాతం విజయవంతం చేయాలని డాక్టర్లు సవిత, భావనలకు సూచించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు సత్వర వైద్యం అందించాలని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్థులకు క్రమం తప్పకుండా మందులు అందించి వాడించాలని, ఇందుకు గ్రామాల్లోని ఆవాలు, ఆరోగ్య కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేలా వైద్యులు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.