Share News

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:58 PM

శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు.

గిరిజన మహిళలకు చీరల పంపిణీ
గిరిజనులకు చీరలు పంపిణీ చేసిన తెలంగాణ భక్తులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన గౌడ్‌ కుటుంబసభ్యులు అటవీశాఖ అధికారుల అనుమతితో అటవీ ప్రాంతంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ఉండే గిరిజన మహిళలకు చీరలు, యువకులకు కండువాలు పంపిణీ చేసినట్లు ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆశీర్వాదం తెలిపారు. కార్యక్రమంలో ఈటీడీఏ అధ్యక్షుడు గురవయ్య, చిన్నోడు, నాగరాజు, వినయ్‌తో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:01 AM