Share News

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:33 AM

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

వెలుగోడు, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. వెలుగోడులో రూ 1.87 కోట్లతో నిర్మించిన రహదారులను బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో ఐసీయూ వార్డును, తన సొంత నిదులతో నూతనంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, వైద్యం, విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వెలుగోడు మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దశల వారిగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పీఆర్‌ డీఈ అయాజ్‌, ఈఈ శ్రీనివాసులు, విద్యుత్‌శాఖ ఏఈ రవీంద్రనాయక్‌, వైద్యాధికారి అమూల్య, సింధుప్రియ, సులోచన టీడీపీ నాయకులు అన్నారపు శేషిరెడి,్డ అబ్దుల్‌కలాం, ఖలీల్‌, రసూల్‌, జాకీర్‌ హుస్సేన్‌, వీరభద్రుడు, పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:33 AM