Share News

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:55 PM

దేశంలో మార్పు రావా లంటే అది విద్యార్థులు, యువతతోనే సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు.

మార్పు విద్యార్థులతోనే సాధ్యం
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

  • సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): దేశంలో మార్పు రావా లంటే అది విద్యార్థులు, యువతతోనే సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక శివారులోని పీజీఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు మూడో రోజు జరిగాయి. ‘అంతర్జాతీయ, జాతీ య, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు విద్యార్థుల కర్తవ్యం’ అనే అంశంపై రామకృష్ణ మాట్లాడారు. యువత, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపుని చ్చారు. వారు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలుతాయన్నారు. ముఖ్యంగా శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో, తమిళనాడులో ప్రభుత్వాల మార్పునకు విద్యార్థులు, యువతే కీలకమన్నారు. విద్యార్థులను, యువతను తక్కువ అంచనా వేయకూడదన్నారు. నేడు ధనవంతులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారని, ప్రజా సేవ చేసేవారికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రముఖ పార్టీలు కూడా డబ్బులున్న వారికే సీట్లు కేటాయిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 80 శాతం ఎమ్మెల్యేలు సంపాదనే ధ్యేయంగా సింగిల్‌ ఎజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.3.30 లక్షల వేల కోట్ల అప్పులు చేశారని, సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లోనే రూ.3.47లక్షల వేల కోట్లు అప్పుల చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాల్లో పుట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీకి లక్షల మంది ఫాలోవర్స్‌ వచ్చారనీ, దీనిపై ప్రభుత్వం కూడా భయాందోళనలకు గురైందన్నారు. కొత్తరకమైన ఆలోచనలతో ముందుకు వెళితే సమాజంలో మార్పుకు విద్యార్థులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు మునెప్ప, లెనిన్‌బాబు, నగర కార్యదర్శి రామకృ ష్ణారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సంతోష్‌కుమార్‌, యుగం ధర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందెల నాసర్‌జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:55 PM