Share News

బైక్‌ దొంగలు అరెస్టు

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:01 AM

కర్నూలులోని త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను త్రీటౌన్‌, సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

బైక్‌ దొంగలు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ హుశేన్‌ పీరా

కర్నూలు క్రైం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలులోని త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను త్రీటౌన్‌, సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉప్పరి వీరేష్‌ (పోలకల్‌, బెళగల్‌), ముక్కెర రాముడు (వర్కూరు, కోడుమూరు)ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6బైకులను స్వాధీనం చేసుకున్నారు. అడిషినల్‌ ఎస్పీ హుశేన్‌పీరా, సీసీఎస్‌ సీఐ రామకృష్ణ, త్రీటౌన్‌ సీఐ శేషయ్య శుక్రవారం నిందితుల వివరాలు వెల్లడించారు. పోలకల్లుకి చెందిన వీరేష్‌ ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ చోరీలకు అలవాటు పడ్డాడు. ముక్కెర రాముడు తన సొంతూరులో వ్యవసాయం చేస్తూ వీరేష్‌ చోరీ చేసిన బైకులను గ్రామాల్లోని రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. వచ్చిన సొత్తును చేరీ సగం పంచుకుంటారు. గతంలో కూడా ఎమ్మిగనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన 15 బైకుల చోరీ కేసుల్లో కూడా వీరిద్దరు నిందితులు. వీరిని పోలీసులు అరెస్టు చేసి 15 బైకులు రికవరీ చేశారు. ఏప్రిల్‌ 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ డాక్టర్‌గా పనిచేసే నిరంజన్‌ తన బైక్‌ను ఆస్పత్రి మెయిన్‌ గేటు వద్ద పార్క్‌ చేసి విధులకు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేశారు. ఇటీవల నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ గం జాయి కేసులో పాత నేరస్తునిపై అనుమానంతో నిఘా ఉంచి అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని సెల్‌లో కొన్ని బైకులకు సంబంధించిన ఫొటోలను గుర్తించి ఆరాతీశారు. ఇవన్నీ తనకు ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ వీరేష్‌ కుదువ పెట్టాడని తెలిపాడు. పోలీసులు వీరే్‌షను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆరు బైకులను చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి ఆరు బైకులు రికవరీ చేశారు. ఇటీవల నెల్లూరు వెళ్లిన వీరేష్‌ వస్తూ నెల్లూరు బస్టాండులో పార్కింగ్‌లో ఉన్న బైక్‌ను చోరీచేసి కర్నూలులో విక్రయించాడు. కేసును ఛేదించిన సీఐలు, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ చెంచన్న, కానిస్టేబుల్స్‌ కృష్ణ, కమలేనాయక్‌, ముజ్‌ఫర్‌ రెహిమాన్‌ను ఏఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 20 , 2026 | 01:01 AM