భక్తులకు మెరుగైన సౌకర్యాలు
ABN , Publish Date - May 21 , 2026 | 12:15 AM
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.
నంద్యాల నూనెపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. బుధవారం పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో భక్తుల సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దర్శనం ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ లాంటి కనీస సౌకర్యాలపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన ఉండేలా ఉద్యోగులు పనిచేయాలన్నారు. క్యూలైన్లు, క్యూకాంప్లెక్సులు, ఆలయ ప్రాంగణంలో నిరంతరం తాగునీటి సరఫరా ఉండాలన్నారు. అలాగే క్యూకాంప్లెక్సులో అల్పాహారాన్ని అందజేస్తుండాలన్నారు. అన్నప్రసాదాలు రుచికరంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. సమావేశంలో అన్నీ శాఖల అధిపతులు, అన్నీ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.