ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్ కృతజ్ఞతలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:33 PM
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ఏపీఎన్‌జీవో భవనంలో శనివారం తాలూకా నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్‌లో చట్టబద్ధత గుర్తింపు కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. పీఆర్‌సీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసి సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లుల త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు మంజునాథ్, కోశాధికారి నాగరాజు, ఉపాధ్యాక్షులు వెంకటేశులు, లక్ష్మీ ,గౌస్ పీరా పాల్గొన్నారు.