విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:43 AM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన బలపనూరు పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులను ఆమె బుధవారం పాఠశాలలో సన్మానించారు. ఉపాధ్యాయులను, సహకరించిన తల్లిదండ్రులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీలో 19 మంది విద్యార్థినులు సీట్లు సంపాదించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎంఈవో కోటయ్య, సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ పాండురంగారావు, ఎంపీటీసీ రంగరమేష్, టీడీపీ నాయకులు శివశంకరరెడ్డి, మోహన్, మొరార్జీదేశాయ్, రామ్మోహన్ నాయుడు, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.