పేదల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:18 AM
సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు రూరల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం ప్యాలకుర్తిలో రెండేళ్ల నమ్మకం- సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి పాలన గురించి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చేబడుతున్నట్లు తెలిపారు. ప్యాలకుర్తిలో రూ. 90 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ప్యాలకుర్తి మెయిన్ బజారులో వెంకటస్వామి అనే దివ్యాంగుడు కూటమి పాలనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే దస్తగిరి పంక్షర్ షాపు నిర్వహిస్తున్న వెంకటస్వామికి కరపత్రం ఇచ్చి ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. దీంతో దివ్యాంగుడు వెంకటస్వామి మాట్లాడుతూ తనకు రూ. 6 వేలు పింఛన్ వస్తోందని, ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వచ్చినట్లు సంతోషం పంచుకున్నాడు. సీఎం చంద్రబాబు పాలన బాగుందని కితాబునిచ్చాడు. దీంతో ఎమ్మెల్యే దస్తగిరి మూడు చక్రాల మోటారు బైక్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, గంగాధర్‌నాయుడు, నాయకులు యూసఫ్, వెంకటేశ్వర్లు, విజయ్, సీతారాముడు, హఖీం సుభహాన్, షేక్షావలి, మిన్నల్ల, శేఖర్, శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.